ఏపీలో శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు.. ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం ఇవాళ భేటీ కానుంది. అలాగే.. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించి ఆమోదించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న మంత్రివర్గ సమావేశ మందిరంలో.. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది.
ఇసుక, మద్యం అక్రమాలను నియంత్రణ నిమిత్తం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది. ప్రత్యేక ప్రభుత్వ విభాగంగా ఎస్ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందు కోసం.. బిజినెస్ రూల్స్ ను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.