తెలంగాణ

telangana

ETV Bharat / city

'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తక ఆవిష్కరణ.. భావోద్వేగానికి గురైన ఏపీ సీఎం - ysr death anniversay news

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఇడుపులపాయలోని వైఎస్​ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం జగన్​ తల్లి విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో జగన్​ భావోద్వేగానికి గురయ్యారు.

'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్​
'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్​

By

Published : Jul 8, 2020, 9:56 AM IST

Updated : Jul 8, 2020, 10:57 AM IST

ఏపీ సీఎం జగన్​... తన తల్లి విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

'నాలో.. నాతో వైఎస్​ఆర్' పుస్తక ఆవిష్కరణ

'నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అని జగన్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:రైతు దినోత్సవం...పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

Last Updated : Jul 8, 2020, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details