CM Jagan in nellore: ప్రతి అడుగులో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తన తోడుగా ఉండేవారని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన గౌతంరెడ్డి సంస్మరణసభలో పాల్గొన్న ఆయన.. గౌతంరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని.. ప్రతి క్షణం ఎంతో తపన పడేవారని, పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని తపించేవారని సీఎం అన్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం పట్ల సీఎం చూపిస్తున్న ప్రేమకు.. గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు బాలినేని, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
మంచి స్నేహితుడిని కోల్పోయా.. గౌతంరెడ్డి సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
CM Jagan in nellore: ఏపీలోని నెల్లూరులో దివంగత మంత్రి గౌతంరెడ్డి సంస్మరణ సభలో.. సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని గౌతంరెడ్డి ఎంతో తపన పడేవారని ముఖ్యమంత్రి తెలిపారు. మంచి వ్యక్తిని, మంచి స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజ్ పేరు పెడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
చిన్నప్పటి నుంచి గౌతంరెడ్డి నాకు తెలుసు. నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నారు. గౌతంరెడ్డి ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవారు. పరిశ్రమలశాఖలో 6 విభాగాలను చూసేవారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని ఎంతో తపన పడేవారు. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారు. మంచి వ్యక్తిని, మంచి స్నేహితుడిని కోల్పోయా. మనిషి చనిపోయాక ఎందరి మనసుల్లో ఉన్నారన్నదే ముఖ్యం. సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజ్ పేరు పెడతాం. -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి:MP Komatireddy tweet: దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరం: ఎంపీ కోమటిరెడ్డి