ఏపీలోని నెల్లూరు ఆయుర్వేదం ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఐసీఎంఆర్ అధికారులతో పరీక్షలు చేయించాలని సూచించారు. కొవిడ్‌పై ఉన్నతాధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
'నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించండి' - ఆయుర్వేద మందుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
ఏపీలోని నెల్లూరు ఆయుర్వేదం ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ సూచించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఏపీ సీఎం జగన్, ఆయుర్వేద మందుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం పంపాలని జగన్ నిర్ణయించారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధం అధ్యయనానికి నిర్ణయించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి :కరోనాకు ఆయుర్వేద మందు.. పంపిణీకి సన్నాహాలు