తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి (AP CM JAGAN MOHAN REDDY) దర్శించుకున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న సీఎం జగన్.. బర్డ్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి పట్టువస్త్రాలను మోసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఉన్నారు. సోమవారం రాత్రి తిరుమలలో బస చేయనున్న సీఎం జగన్.. మంగళవారం మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.