తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ - అమిత్​ షా తో సీఎం జగన్ భేటీ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు సహా పోలవరం, వరద సాయంపై చర్చించారు.

jagan met sha
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

By

Published : Dec 15, 2020, 10:27 PM IST

దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. గంటపాటు ఇరువురి మధ్య కొనసాగిన ఈ సమావేశంలో... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏపీలో ఆకాల వర్షాల నేపథ్యంలో వరద సాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్​లోని తాజా పరిస్థితులతో పాటు మూడు రాజధానుల వ్యవహారంపై అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్​ చర్చించినట్లు సమాచారం.

కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఇవీచూడండి:రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details