తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ, ఆ అంశాలపై చర్చ - ప్రధాని నరేంద్ర మోదీతో జగన్​ భేటీ

CM JAGAN ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​ భేటీ దిల్లీలో అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరారు.

జగన్
జగన్

By

Published : Aug 22, 2022, 3:08 PM IST

CM DELHI TOUR పోలవరం బకాయిలను.. 15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా.. లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లిన సీఎం.. సుమారు 40 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో.. వివిధ అంశాలపై వినితిపత్రం అందజేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2వేల 900 కోట్ల రూపాయలను.. రీయంబర్స్‌ చేయాలని కోరారు. పోలవరం సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన.. 55 వేల 548 కోట్ల రూపాయల అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపోనెంట్‌వైజ్‌గా రీయంబర్స్‌ విధానానికి స్వస్తి పలకాలని, దీనివల్ల పనుల్లో.. విపరీత జాప్యం ఏర్పడుతోందన్నారు.

ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం విషయంలోనూ మొత్తం వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయంబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు . రీసోర్స్‌ గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన 32 వేల 625 కోట్ల రూపాయలను.. మంజూరు చేయాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ డిస్కంలనుంచి రావాల్సిన 6వేల756 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పిస్తే.. కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయని.. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని సీఎం తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను వినతిపత్రంలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details