CM Jagan On PRC:పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని.. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని చెప్పారు.