తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యవసాయరంగాన్ని మరింత మెరుగుపరిచేందుకే పథకం: జగన్ - వైఎస్సార్ యంత్రసేవా పథకం తాజా వార్తలు

YSR Yantra Seva Scheme: ఏపీలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించారు. అనంతరం సీఎం స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.

YSR Yantra Seva Scheme
ఏపీలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం

By

Published : Jun 7, 2022, 9:54 PM IST

వ్యవసాయరంగాన్ని మరింత మెరుగుపరిచేందుకే పథకం: జగన్

YSR Yantra Seva Scheme: సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగించుకునేందుకు వీలుగా 'వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మేలు చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ గుంటూరులో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం స్వయంగా ట్రాక్టర్ నడిపారు.

గత ప్రభుత్వంలో వాహనం పొందాలంటే రైతుల ఇష్టానికి తావు ఉండేది కాదని... తాము మాత్రం రైతులు కోరుకున్న కంపెనీ వాహనాలనే అందిస్తున్నామని సీఎం తెలిపారు. 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్ట్ హార్వెస్టర్లును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.690 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు. ఇందులో రైతుల రాయితీకి సంబంధించి రూ.175 కోట్లను ముఖ్యమంత్రి బటన్​ నొక్క వారి ఖాతాల్లోకి జమ చేశారు.

40 శాతం రాయితీతో ట్రాక్టర్లు, యంత్రపరికరాలు అందిస్తున్నామని.. రైతులు 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని సీఎం జగన్ తెలిపారు. మిగతా 50 శాతాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నట్లు వివరించారు. ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలుస్తున్నామని.. విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు జగన్‌ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details