తెలంగాణ

telangana

ETV Bharat / city

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: జగన్​ - సీఎం జగన్ వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించిన పింగళి వెంకయ్య సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని ఆయన పేర్కొన్నారు.

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: జగన్​
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: జగన్​

By

Published : Mar 12, 2021, 4:17 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ను పురస్కరించుకుని పింగళికి భారతరత్న ప్రకటించటం సముచితమని ఏపీ ముఖ్యమంత్రి లేఖలో పేర్కోన్నారు.

ఆంధ్రప్రదేశ్​ మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించారని... ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని జగన్ పేర్కొన్నారు. అరుణా ఆసఫ్ అలీ, భూపేంద్రకుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లాంటి ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు.

ఇదీ చదవండి:'ఉద్యోగ, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'

ABOUT THE AUTHOR

...view details