తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: ఏపీ సీఎం జగన్ - పోలవరంపై జగన్ కామెంట్స్

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని ఏపీ సీఎం జగన్​ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

cm-jagan-letter-to-pm-modi-over-polavaram
పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: ఏపీ సీఎం జగన్

By

Published : Oct 31, 2020, 6:49 PM IST

విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై ప్రధానికి లేఖ రాసిన సీఎం.. నిర్వహణ మాత్రమే ఏపీ ప్రభుత్వ బాధ్యతన్నారు. పోలవరానికి అన్ని అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్న జగన్... విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన అంచనా మెుత్తం అవమానకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

సవరించిన అంచనాలను సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించాయని జగన్ వెల్లడించారు. రూ. రూ.55,656 కోట్ల అంచనాలు ఆమోదించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. సాంకేతిక కమిటీ, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2017-18లో పంపిన అంచనాలను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి.. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details