తెలంగాణ

telangana

ETV Bharat / city

Clean Andhra: స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించిన జగన్​ - క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తాజా వార్తలు

ఏపీలోని విజయవాడలో జగనన్న స్వచ్ఛ సంకల్పం(clean andhra) కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం జగన్​ పాల్గొన్నారు. స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను జగన్​ ప్రారంభించారు.

clean andhra
స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్

By

Published : Oct 2, 2021, 1:59 PM IST

స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్​

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్(clean andhra) కార్యక్రమాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. స్వచ్ఛ సంకల్పం, క్లాప్ పథకాల అమలులో భాగంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. గార్బేజ్ టిప్పర్ వాహనం, హై ప్రెజర్ క్లీనర్లను సీఎం జగన్​ పరిశీలించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు నివాళులు అర్పించారు.

పునర్వినియోగానికి అనుకూలంగా

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని(clean andhra) రూపొందించడమే లక్ష్యంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్(clean andhra) కార్యక్రమాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తడి, పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికీ 3 డస్ట్‌బిన్‌ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్‌ల పంపిణీ చేయనున్నారు. చెత్త సేకరణ కోసం 5,868 జీపీఎస్‌ ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల నుంచి తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల వద్దకు చేర్చనున్నారు. తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు, బయోగ్యాస్ తయారీతో పాటు పొడి చెత్త నుంచి హానికారక వ్యర్ధాలను వేరు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా వస్తువులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు 10,731 హైప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్లు కొనుగోలు చేశారు.

గ్రీన్​ అంబాసిడర్స్​

గ్రామీణ ప్రాంతాల్లో 23,000 మంది గ్రీన్‌ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ, రవాణా, శుద్దీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతతో పాటు కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం(clean andhra) నిర్ణయించింది. అందుకోసం గ్రామ పంచాయతీలకు 14,000 ట్రైసైకిల్స్‌ పంపిణీ చేయనున్నారు. పదివేల పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో చెత్త సేకరణ, రవాణా కోసం 1,000 ఆటో టిప్పర్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యూజర్ ఛార్జీలు

మాస్కులు, శానిటరీ ప్యాడ్‌లు వంటి వ్యర్ధాల ద్వారా వ్యాధులు ప్రబలకుండా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించి భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్‌ పరికరాల పంపిణీ చేయనున్నారు. దోమల నివారణకు 10,628 థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. 135 మేజర్‌ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. అయితే వీటి నిర్వహణ ఖర్చులకు గ్రామాల్లో ఇంటికి రోజుకు 50 పైసల నుంచి 1 రూపాయి వరకూ యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా(clean andhra) అన్ని మున్సిపాలిటీల పరిధిలో నూ 1,500 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు చెత్తను వేరు చేసేందుకు వీలుగా 1.20 లక్షల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తబుట్టలను పంపిణీ చేయనున్నారు. చెత్త రవాణా కోసం 3097 ఆటో టిప్పర్లు, 1771 ఎలక్ట్రిక్ ఆటోలను సరఫరా చేయనున్నారు. మున్సిపాలిటీలలో 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల ఏర్పాటు చేయనున్నారు. 72 మున్సిపాలిటీల్లో సమీకృత వ్యర్ధాల నిర్వహణ యాజమాన్య ప్రాజెక్టు ఏర్పాటు కోసం టెండర్లను కూడా ఖరారు చేశారు. మరోవైపు యూజర్ ఛార్జీలుగా ప్రతీ ఇంటి నుంచి రోజుకు 1 రూపాయి నుంచి 4 రూపాయల వరకూ వసూలు చేయనున్నారు.

సీఎం విజయవాడ పర్యటన దృష్ట్యా అధికారులు ట్రాఫిక్ మళ్లించారు. సీతానగరం ప్రకాశం బ్యారేజీపై వాహనాలు భారీగా నిలిచాయి. సాయిబాబా గుడి నుంచి బ్యారేజీ వరకు 3 కి.మీ. మేర వాహనాలు నిలిచాయి.

ఇదీ చదవండి:No permission for Jung Siren Rally : 'ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు'

ABOUT THE AUTHOR

...view details