తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagan At YSR Pension: 'ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం' - వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు

Jagan on Pensions: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.2,500కు పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్​ పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.2,250కు పెంచడమే కాకుండా.. రెండున్నరేళ్లలో రూ.2,500 ఇస్తున్నామని వెల్లడించారు.

Jagan
Jagan

By

Published : Jan 1, 2022, 6:53 PM IST

Jagan on Pensions: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఏపీ సీఎం జగన్​ అన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.2,250కు పెంచామని.. రెండున్నరేళ్లలో మళ్లీ పెంచి రూ.2,500 ఇస్తున్నామని తెలిపారు. పెంచిన పింఛను శనివారం.. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందిస్తారని సీఎం జగన్​ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు కార్యక్రమంలో సీఎం జగన్​ పాల్గొన్నారు.

'ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరైనా.. మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించట్లేదా. రాష్ట్రంలో ఇవాళ 62లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం నెలకు పింఛన్‌లకు రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిది. దాన్ని వైకాపా ప్రభుత్వం రూ.1450 కోట్ల నుంచి రూ. 1,570 కోట్లకు పెంచింది. అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఓటీఎస్ పథకం ద్వారా గృహ హక్కు కల్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు'

-- జగన్​

పేదలకు అందుబాటులో వినోదం అందించేందుకు సినిమా టికెట్లు ధరలు తగ్గించామని... కానీ ఆ విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారని సీఎం జగన్​ అన్నారు. వీరంతా పేదలకు శత్రువులని విమర్శించారు. పేదలకు మంచి జరగకూడదని వారు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రూ.256 కోట్లు మంజూరు చేశామని.. పనులు త్వరగా పూర్తి చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

రూ.1,570 కోట్లు విడుదల..

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. దీంతో పింఛను మొత్తం రూ.2,500 కానుంది. రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,570 కోట్లు విడుదల చేసింది.

పేదరికమే కొలమానంగా..

కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచటం అందరూ సంతోషించే విషయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం వైకాపా అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట కోసం సీఎం జగన్​ ఎంత దూరమైనా వెళ్తారని మంత్రి అన్నారు. కరోనా వంటి కష్ట కాలంలో కూడా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ప్రత్తిపాడు ప్రాంతం గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉందని, గుంటూరు-ప్రత్తిపాడు రెండు వరుసల రహదారి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని సుచరిత కోరారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details