Talli bidda express: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. అధునాతన వసతులతో కూడిన 500 'వైఎస్‌ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అందుకోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. నాడు–నేడు పనులతో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నామని వ్యాఖ్యానించారు.
Talli bidda express: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ - తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
Talli bidda express: ఏపీలోని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 'వైఎస్‌ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' నూతన వాహనాలను.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సిజేరియన్ అయితే రూ.3 వేలు, సహజ ప్రసవం అయితే రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద విశ్రాంతి సమయంలో ఇస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డలను ఏసీ వాహనాల్లో ఇంటి వరకు పంపించి.. వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండేలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో అక్కాచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సోప్ బాక్స్‌లో కెమెరా పెట్టి.. బాత్రూంలో టీచర్ వీడియో తీసిన విద్యార్థి