కార్పొరేషన్లు, మున్సిపల్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. మహిళలకు 61 శాతం పదవులు కేటాయించామని చెప్పారు. పరిశుభ్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న సీఎం... ప్రతి వార్డుకు 2 చొప్పున 8 వేల వాహనాలు కేటాయించినట్టు వెల్లడించారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమని... వివక్షకు తావులేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు.
కార్పొరేషన్లు, మున్సిపల్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత: జగన్ - CM Jagan Latest News
కార్పొరేషన్లు మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ తరగతుల కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్
అర్హులకు ప్రభుత్వ ఫలాలు కచ్చితంగా అందాలి. దేశంలో తొలిసారిగా వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయాల్లో 540 రకాల సేవలు అందిస్తున్నాం. మరింత మెరుగైన సేవలకు సూచనలు ఇవ్వాలి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేశాం. పేదల కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేశాం.
- జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి