అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరులో మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో 11 సీబీఐ ఛార్జ్ షీట్లపై విచారణకు తన బదులు న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని జగన్ అభ్యర్థించారు.
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్పై నేడు విచారణ - అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ న్యూస్
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
సీఎం జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్పై నేడు విచారణ
వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ... హైకోర్టులో నిన్న జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తానూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్పై నేడు సుప్రీం విచారణ