తెలంగాణ

telangana

ETV Bharat / city

పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం - సీఎం జగన్ తాజా వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించారు. ఈ నెల 31కి జాతీయ పతాక రూపకల్పనకు వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్ ఘనంగా సత్కరించారు.

cm jagan, pingali venkaiah's daughter
సీఎం జగన్​, పింగళి వెంకయ్య కుమార్తె

By

Published : Mar 12, 2021, 2:58 PM IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని ఆమె నివాసానికి వెళ్లిన జగన్.. సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు.

జాతీయ పతాకం రూపొందించి ఈ ఏడాది మార్చి 31కి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆమెకు సన్మానం చేశారు. సీతామహాలక్ష్మిని సీఎం జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను జగన్ తిలకించారు.

పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

ఇదీ చదవండి:జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. పీఆర్సీ ఎలా ఇస్తుంది.?: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details