తెలంగాణ

telangana

ETV Bharat / city

cm jagan fire: వైకాపా నేతల మధ్య వివాదం.. సీఎం జగన్ వార్నింగ్ - తాడేపల్లికి చేరిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ

వైకాపాలో రాజమండ్రి రాజకీయ పంచాయతీ ఏపీ సీఎం జగన్(AP CM JAGAN)​ వద్దకు వెళ్లింది. ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(mla jakkampudi raja and mp bharat) మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో వివాదం కాస్తా ముదిరింది. దీంతో నేతలిద్దరూ సీఎం జగన్​ను కలిశారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వారిని హెచ్చరించారు.

CP MLA Vs MP
వైకాపా నేతల మధ్య వివాదం

By

Published : Sep 28, 2021, 10:46 PM IST

ఏపీలో రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంచాయితీ (mla jakkampudi raja and mp bharat controversy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఇవాళ నేతలిద్దరూ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ను కలిశారు. వీరిద్దరూ ఇటీవల బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సీఎం ఆగ్రహం(cm jagan fire on ycp leaders controversy) వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.

అంతకుముందు వీరిద్దరినీ పిలిచి వివరణ తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వైవీ సుబ్బారెడ్డిని జగన్‌ ఆదేశించారు. దీంతో ఆయన వారిని తాడేపల్లికి పిలిపించి రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఇద్దరితో మాట్లాడి వివరణ తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి పంచాయితీ కొనసాగింది. ఇవాళ జరిగిన సమావేశంపై రేపు మీడియాతో మాట్లాడతానని ఎంపీ భరత్ స్పష్టం చేశారు.

వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే..!

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.

  • సంబంధిత కథనం:

MP Vs MLA : సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details