కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు.
ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.