అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నగదు చెల్లింపులు చేశారు. 3 లక్షల 14 వేల మంది బాధితులకు.. 459 కోట్ల 23 లక్షల రూపాయలను.. వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి డిపాజిటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి చిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారునన్న సీఎం.. బాధితులకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.
మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసింది. బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది. ప్రైవేటు సంస్థ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును బాధితులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇలా ఆదుకున్న ఘటన దేశ చరిత్రలో ఎక్కడా లేదు. గత ప్రభుత్వం వ్యక్తుల కోసం జరిగిన మోసం అగ్రిగోల్డ్ స్కామ్. ఎంతో కష్టపడి పొదుపు చేసిన వారు మోసపోయారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి 2019 నవంబర్ లోనే రూ. 238.73 కోట్లు చెల్లించాం. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం.