తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2021, 4:40 PM IST

Updated : Nov 2, 2021, 5:23 PM IST

ETV Bharat / city

Badvel By Election: జగన్ కంటే ఎక్కువ మెజార్టీతో సుధ విజయం.. ఎంతో తెలుసా?

ఏపీలోని కడప జిల్లా బద్వేలు బై పోల్​లో వైకాపా భారీ విజయం సాధించింది(ycp win in badvel bypoll ). వైకాపా అభ్యర్థి 90 వేలకు పైగా మెజార్టీతో అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంపై అభ్యర్థి డాక్టర్ సుధ, మంత్రులను సీఎం జగన్​ అభినందించారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మెజార్టీ కంటే అధిక మెజార్టీ దక్కించుకున్నారు డాక్టర్ సుధ.

badvel
కడప జిల్లా బద్వేలు బై పోల్​లో వైకాపా భారీ విజయం

ఏపీలో జరిగిన బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైకాపా అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా నేతలను సీఎం అభినందించారు.

సీఎం జగన్ మెజార్టీ కంటే అధికం..

ఉప ఎన్నికలో గెలిచిన డాక్టర్ సుధ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచిన జగన్​ (90,110) మెజార్టీని బ్రేక్ చేసింది. ఈ ఉప ఎన్నికలో సుధకు 90,533 ఆధిక్యం దక్కింది.

ప్రజలకు ధన్యవాదాలు: వైకాపా అభ్యర్థి సుధ

నియోజకవర్గ ప్రజలకు వైకాపా అభ్యర్థి సుధ.. ధన్యవాదాలు తెలిపారు. అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు.. విజయానికి సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికే తన మెుదటి ప్రాధాన్యమని అన్నారు.

భాజపాను నడిపించింది తెదేపానే..

బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా సాధించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు తీరుకు ఈ విజయం నిదర్శనమన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలు, సామాన్యుడి విజయమని చెప్పారు. పోటీ చేయడం లేదని చెప్పిన తెదేపా వెనుక ఉండి భాజపాను నడిపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయన్నారు.

ఇదీ చదవండి:

Badvel Bypoll Result: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్​ జోరు.. మెజార్టీ ఎంతంటే..

Last Updated : Nov 2, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details