CM Jagan on ISRO scientists: పీఎస్‌ఎల్‌వీ సీ-52ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ సీఎం జగన్ అభినందించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. భవిష్యత్ ప్రయత్నాలలోనూ ఇస్రో విజయం సాధించాలని ముఖ్యమంత్రి కోరారు.
ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్-1, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతేకాకుండా ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.
ఇదీ చదవండి: