74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విభజన గాయాలు మానాలన్నా.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నా పాలన వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. అందుకే మూడు రాజధానుల బిల్లులను చట్టంగా మార్చామని స్పష్టం చేశారు.
త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: ఏపీ సీఎం జగన్
ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే 3 రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించేవరకు పోరాటం ఆపమని ఏపీ సీఎం జగన్ ఉద్ఘాటించారు. భవిష్యత్తులో కేంద్రం మనసు మార్చుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేని ధోరణిని ఆచరణలో చూపుతున్నామని జగన్ అన్నారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా.. కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ అన్నారు.
ఇవీచూడండి:సరికొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ సరైన కేంద్రం: మంత్రి కేటీఆర్