తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా - సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు.

cm-jagan-case-hearings-postpone-in-hyderabad-cbi-court
జగన్ ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా

By

Published : Oct 20, 2020, 4:37 PM IST

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్నారు. కేసు తదుపరి విచారణను ఇన్​ఛార్జి న్యాయమూర్తి ఈనెల 27కి వాయిదా వేశారు. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది.

అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్​లో ఉంది. నవంబరు 5న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలపడం వల్ల తదుపరి విచారణను నాంపల్లి కోర్టు నవంబరు 9కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ఏపీ: న్యాయ వ్యవస్థపై యుద్ధమా?

ABOUT THE AUTHOR

...view details