అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM JAGAN) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP RAGHURAMA) దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. తాను షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని సీఎం జగన్ గత నెల 1న కౌంటరు దాఖలు చేశారు. చట్టప్రకారం, విచక్షణ మేరకు కోర్టు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ(CBI) మెమో దాఖలు చేసింది.
jagan case: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ - జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో నేడు విచారణ
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM JAGAN) బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై.. నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది. దీనికి సంబంధించి గత నెల 1న సీఎం జగన్ కౌంటరు దాఖలు చేశారు.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ
కౌంటరులో జగన్ పేర్కొన్న అంశాలపై సమాధానం ఇస్తూ గత నెల 14న రఘురామకృష్ణరాజు(RRR) రిజాయిండర్ దాఖలు చేశారు. పిటిషన్ వేసినందుకు తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఇతర నిందితులు, సాక్షులుగా ఉన్న అధికారులకు ప్రయోజనాలు కల్పించారని ఎంపీ పేర్కొన్నారు. దీనిపై తదుపరి వాదనల కోసం కోర్టు పిటిషన్ను నేటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు'