ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నందున (Heavy Rains) అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్(CM jagan) సూచించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతవరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.