భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష - వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష
![భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9183529-thumbnail-3x2-kcr.jpg)
14:59 October 15
భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలు, వరదలపై ప్రగతిభవన్‌లో సమీక్షించేందుకు... సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం తీసుకుంటున్న, భవిష్యత్‌తో చేపట్టాల్సిన చర్యల, పునరావాస చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహా సీఎస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున... సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో అధికారులు హాజరయ్యారు.