ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని సీఎం ఆదేశం - prc updates
20:03 January 24
పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై చర్చలకు సీఎం ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. వారం, పది రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. ఈమేరకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్ చర్చించనున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవలే సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి... సీఎం కేసీఆర్ హామీ మేరకు గడువులోగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. గతంలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్... వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై అధికారుల కమిటీ వీలైనంత త్వరగా చర్చలు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.