తెలంగాణ

telangana

ETV Bharat / city

'అంబులెన్స్ కు దారిచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్' - సీఎం జగన్ కాన్వాయ్ పై వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో సీఎం జగన్ కాన్వాయ్ ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చింది. గూడవల్లి -నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కొద్దిగా వేగం తగ్గించుకుంది.

'అంబులెన్స్ కు దారిచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్'
'అంబులెన్స్ కు దారిచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్'

By

Published : Sep 2, 2020, 3:49 PM IST

కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా గూడవల్లి-నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కొద్దిగా వేగం తగ్గించుకుని ఆంబులెన్స్ కు దారి ఇచ్చింది.

ఉయ్యూరు నుంచి బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి గన్నవరం వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను జాతీయ రహదారుల సంస్థకు చెందిన అంబులెన్స్ లో విజయవాడలోని ఈఎస్ఐ అస్పత్రికి తరలించారు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ వెళ్తుండటంతో ముందుగా అంబులెన్స్ కు దారి ఇవ్వాలని ఏపీ సీఎం సూచన మేరకు కాన్వాయ్​ను పక్కకు తొలగించారు.

ఇదీ చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

ABOUT THE AUTHOR

...view details