సీఎల్పీ సమావేశం: 25 అంశాలపై నేతల చర్చ - సీఎల్పీ సమావేశం
08:36 September 07
సీఎల్పీ సమావేశం: 25 అంశాలపై నేతల చర్చ
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధానంగా సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగిన భేటీకి.. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హాజరయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో లెవనెత్తాల్సిన అంశాలపై సీఎల్పీ చర్చించింది. మొత్తం 25 అంశాలను సీఎల్పీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ప్రారంభమవ్వగానే ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సీఎల్పీ సంతాపం ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతికి కూడా సీఎల్పీ సంతాపం తెలిపింది.