బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏలా ఉండాలి... ప్రజా సమస్యలను ఏవిధంగా సభ దృష్టికి తీసుకెళ్లాలి తదితర అంశాలపై కాంగ్రెస్ శాసనసభాపక్షం చర్చించింది. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీలో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం జరిగింది. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగింది. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరై... సీఎల్పీ సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు.
అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎల్పీ సమావేశం - CONGRESS
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీలో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమైంది. శాసనసభలో వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి సమావేశంలో చర్చించారు.
సీఎల్పీలో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం