రాష్ట్రంలో ఏం జరుగుతుందో... రాష్ట్రం ఎటు వెళుతోందో తెలియడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ వెనీస్ నగరాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ బిల్లుపై చర్చలో భాగంగా... హైదరాబాద్ గురించి మాట్లాడనీయకుండా మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఆకస్మాత్తుగా వర్షం వచ్చినప్పడు రెస్క్యూ చేసేందుకు జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రూ. 72వేల అభివృద్ది ఎక్కడ పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఎటెళుతోంది... అసలేం జరుగుతోంది: భట్టి - కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించిన భట్టి విక్రమార్క
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ వెనీస్ నగరాన్ని తలపించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రెస్క్యూ చేయడంలో జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం విఫలమయ్యాయని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని భట్టి ఖండించారు.

ఈఎన్‌సీ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ఈ ఏడేళ్ల కాలంలో జరిగిన ప్రాజెక్టులపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘటన పరిశీలన కోసం వెళ్తున్న కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి తానూ కూడా కల్వకుర్తికి వెళ్లి తీరుతామని ఎంతమంది పోలీసులను పెట్టి ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు.
ఇదీ చూడండి:కేఎల్‌ఐ పరిశీలన యత్నం.. విపక్షనేతల అరెస్టు...ఉద్రిక్తత