తెలంగాణ

telangana

ETV Bharat / city

Bhatti Vikramarka Comments: నిర్ణయాలు చేయాల్సిన ప్రభుత్వమే నిరసనలు తెలిపితే ఎలా..? - తెరాస ప్రభుత్వం ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధర్నా(TRS dharna today)పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(clp leader bhatti vikramarka) ఆసక్తికర కామెంట్స్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ధర్నాలు చూస్తుంటే.. "మాకు పాలన చేతకాదని రోడ్ల మీదికొచ్చి అరిచి చెప్పినట్టుంది.." అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

clp leader bhatti vikramarka comments on TRS dharna today
clp leader bhatti vikramarka comments on TRS dharna today

By

Published : Nov 12, 2021, 7:01 PM IST

నిర్ణయాలు చేయాల్సిన ప్రభుత్వమే నిరసనలు తెలిపితే ఎలా..?

ధాన్యం కొనుగోలు అంశంపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ధర్నా(TRS dharna today)పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(bhatti vikramarka latest news) స్పందించారు. రైతుల కష్టాలను తీర్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. భాజపా, తెరాస ప్రభుత్వాలు కలిసి.. దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టాయని విమర్శించారు. నిర్ణయాలు చేయాల్సిన ప్రభుత్వమే నిరసనలు తెలిపితే ఎలా..? చురకలంటించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని భట్టి ఆరోపించారు. సాగును నిర్వీర్యం చేసేందుకే రెండు ప్రభుత్వాలు ధర్నాల నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్ర..

"రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొని.. వాళ్ల కష్టాలు తీర్చే ప్రభుత్వాలు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తున్నారు. కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భాజపా నాయకులు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇటు.. కేంద్రం కొనాలని రాష్ట్రప్రభుత్వం ధర్నా చేస్తోంది. దీని వల్ల ప్రజలకు ఏం చెప్తున్నారు..? మాకు పాలన చేత కాదు.. మేం రైతులను ఆదుకోలేం.. వ్యవసాయాన్ని కాపాడలేమని.. రోడ్ల మీదికొచ్చి.. అరిచి చెబుతున్నట్టుంది. ఈ రెండు ప్రభుత్వాల వైఖరిని అర్ధం చేసుకోండి. రైతులను ఫుట్​బాల్​ అడుకుంటున్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్​ శక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. గతంలో... కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నా.. రెండూ సమన్వయం చేసుకుంటూ ప్రజల అవసరాలనూ తీర్చుకుంటూ ముందుకెళ్లాయి. ఇలా... మాకు పాలన చేతకాదని చేతులెత్తేసి రోడ్ల మీదికి రాష్ట్ర ప్రభుత్వమే రావటం ఇదే మొదటి సారి." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత.

రాజకీయ పబ్బం గడుపుతున్నారు..

అధికారంలో కూర్చొని చేయాల్సిన పనులన్నింటినీ గాలికొదిలేసి.. కేవలం రాజకీయ కార్యకరపాలు చేస్తూ పబ్బం గడపుతున్నారని భట్టి మండిపడ్డారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ పాలన వల్ల 50 ఏళ్లు వెనక్కి వెళ్లామన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేవలం ఒక ఇంటికి మాత్రమే రాష్ట్ర పాలనను పరిమితి చేశారన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పాలనను పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. పబ్లిక్​ సెక్టార్​ సంస్థలన్నింటినీ తెగనమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై జవాన్​- జై కిసాన్​ నినాదాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్​ రంగానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చివరికి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనమని.. గందరగోళ పరిస్థితులకు కారణమయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details