Bhatti Comments on Assembly Sessions : అధికార పార్టీ నేతలు.. పదే పదే తమ నాయకులను అవమానిస్తున్నారని సీఎల్పీ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలోనూ తమను కించపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. సభలో సభ్యులను గౌరవంగా సంబోధించాలి గానీ.. వారు చేసే వృత్తులను బట్టి పిలవకూడదని సూచించారు.
Bhatti on Assembly Sessions 2022 : "ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పదేపదే కాంట్రాక్టర్ అనడం సరికాదు. శాసనసభ్యులు చాలా మందికి వృత్తులు ఉంటాయి. అలాగని వారి వృత్తి గురించి సభలో ఎందుకు మాట్లాడతారు. ఎవరైనా గౌరవసభ్యులు అనే సంబోధించాల్సి ఉంటుంది. స్పీకర్ పోచారం కూడా తాను కాంట్రాక్టర్‌నే అని చెప్పారు. అలాగని సభాపతిని కాంట్రాక్టర్ అని పిలవలేం కదా. ఎమ్మెల్యేలను కూడా అంతే. "