తెలంగాణ

telangana

ETV Bharat / city

'దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి' - సీఎల్పీ సమావేశం

Bhatti Vikramarka Comments: సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన నేతలు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేశారు. తీర్మానాన్ని దిల్లీకి పంపిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

CLP leader Bhatti Vikramarka Comments on Rahul gandhi
CLP leader Bhatti Vikramarka Comments on Rahul gandhi

By

Published : Mar 16, 2022, 4:42 PM IST

Updated : Mar 16, 2022, 6:40 PM IST

'దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి'

Bhatti Vikramarka Comments: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రాహుల్​ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకోవటం చాలా అవసరమని సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశ సారాంశం కూడా ఇదేనని తేల్చారు.

దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామ రక్షా అని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి​పై వీహెచ్ వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తనకు తెలీదని చెప్పుకొచ్చారు. దిల్లీకి ఎవరైనా వెళ్లవచ్చని.. వెళ్తామని ఎవరైనా చెప్పొచ్చని.. అందులో ఎలాంటి అభ్యంతరం లేదని భట్టి వివరించారు.

"సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచాం. పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చర్చించాం. దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మత పరమైన హింసలు జరుగుతున్నాయి. దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరాం. దానికి అనుగుణంగా రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం. ఏ పదవులు ఆశించకుండా రాహుల్ ఇంతకాలం పనిచేశారు. పార్టీ నిర్మాణం కోసం మళ్లీ రాహుల్ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నాం. కపిల్ సిబాల్ వంటి నాయకులు మేధావులుగా పనిచేసినప్పటికీ గాంధీ కుటుంబమే దేశాన్ని కాపాడింది. గాంధీ కుటుంబం కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడం వల్లే వాళ్లు కేంద్ర మంత్రులయ్యారు." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చూడండి:

Last Updated : Mar 16, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details