Bhatti Comments: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గురించిన ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని భట్టి నిలదీశారు. కేసీఆర్, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆలస్యం వల్లే విద్యార్థులు చనిపోయారనటాన్ని భట్టి తీవ్రంగా తప్పుబట్టారు.
కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు..?
"బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా..? బిల్లుపై ఓటింగ్ సమయంలో తలుపులు మూయటం ఎప్పుడూ జరిగేదే. కాంగ్రెస్ ఆలస్యం వల్ల విద్యార్థులు చనిపోయారనటం సరికాదు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే కేసీఆర్ సభలోనే లేరు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. సభలో బలం లేనప్పుడు కీలక బిల్లులు పెట్టకూడదు. అందరినీ ఒప్పించేందుకు కాంగ్రెస్‌కు కొంత సమయం పట్టింది. ప్రధాని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు. కేసీఆర్, మోదీ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవీ."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత