రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళ తీసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శాంత్రి భద్రతలు క్షీణించాయని.. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ అసమర్థతతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భట్టి విమర్శించారు. కేసీఆర్ వైఖరితో ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు చేసుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉంది: భట్టి - రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉంది: భట్టి విక్రమార్క
రాష్ట్ర పరిస్థితి ఆందోళకంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇష్టానుసారం ఖర్చుచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని మండిపడ్డారు. ఈ ఆరేళ్లలో ప్రభుత్వం రూ.3 లక్షలు కోట్లు అప్పు చేసినట్లు భట్టి ఆరోపించారు.
![రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉంది: భట్టి clp leader bhatti vekramarka allegations on kcr government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5360956-673-5360956-1576230948014.jpg)
రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉంది: భట్టి విక్రమార్క
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. ఎన్నికల హామీలు అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించలేదని.. నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. పోడు భూములు లాక్కొని గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వ్యయాన్ని పెంచారన్నారు. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు తేలిందని భట్టి తెలిపారు.
రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉంది: భట్టి విక్రమార్క
TAGGED:
clp leader fires on cm kcr