విచ్చలవిడి మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తుండడమే ఇందుకు కారణమన్నారు.
రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులకు చెబుతాం: భట్టి - CLP LEADER BHATTI FIRES ON GOVERNMENT STRATEGIES
తెరాస ప్రభుత్వం చేసిన రూ.3లక్షల కోట్ల అప్పులను మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో తీర్చాలనుకుంటుందని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. అందువల్లనే మద్యం ధరలను పెంచినట్లు తెలిపారు.
రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులకు చెబుతాం: భట్టి
కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఇతర పథకాలకు చేసిన అప్పులను మద్యం నుంచి వచ్చిన ఆదాయం ద్వారా తీర్చాలనుకుంటున్నారని భట్టి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే తీవ్ర నిరసనలు తప్పవని హెచ్చరించారు. అడ్డగోలు అప్పులు ఇవ్వొద్దని కమర్షియన్ బ్యాంకులకు చెబుతామని సీఎల్పీ నేత భట్టి తెలిపారు.
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'