సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో భారీగా కోతలు విధించారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తూ... సొంత సొమ్ము ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జనాభాలో సగం ఉన్న బీసీల సంక్షేమంపై ప్రభుత్వం మాటలు చెబుతోంది తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.
కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్కా బీ నహీ: భట్టి - సంక్షేమ శాఖలకు కేటాయింపులపై భట్టి ఆగ్రహం
ప్రభుత్వం చేసే తప్పులను సరిదిద్దేందుకే తమను కూడా గెలిపించి ఇక్కడికి పంపించారని భట్టి అన్నారు. సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు, సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎవరి సొంత డబ్బు ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు.
కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్కా బీ నహీ: భట్టి
ప్రాజెక్టులు తామే నిర్మించామని తెరాస గొప్పలు చెబుతుంది కానీ... ఎస్ఆర్ఎస్పీ, ఎగువ, దిగువ, మధ్య మానేరు, కాకతీయ కాలువలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిననేనని భట్టి అన్నారు. కొత్తగా ఎన్ని విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టి, ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సరైన ఫలాలు దక్కడం లేదనే రాష్ట్రం సాధించుకున్నప్పుడు... ప్రతి విషయాన్ని గతంతో పోల్చడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చూడండి:అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కమలనాథులు: కేసీఆర్
Last Updated : Mar 12, 2020, 9:03 PM IST