తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని... గత ప్రభుత్వాలు ఏం చేయలేదనే విధంగా తెరాస మాట్లాడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమాక్క అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతే నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వచ్చినమాట వాస్తవమేనని తెలిపారు. ఇవన్నీ ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారనేది నిజం కాదని చెప్పారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల వల్లే ఇది సాధ్యమైందన్నారు. విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో భట్టి మాట్లాడారు.
తెరాస వచ్చాకే నాణ్యమైన విద్యుత్తు వస్తోంది... కానీ! - భట్టి విక్రమాక్క వార్తలు
తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ వస్తోందనే మాట వాస్తవమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కానీ గత ప్రభుత్వాలు చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టుల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు విద్యుత్ ప్లాంట్లను మాత్రమే ప్రారంభించిందని.. ఇంకా ఉత్పత్తి మొదలు కాలేదని చెప్పారు.
batti vikramarka
తెరాస వచ్చిన తర్వాత కేవలం రెండు విద్యుత్ ప్లాంట్లను మాత్రమే చేపట్టిందని భట్టి వెల్లడించారు. ఇంకా విద్యుత్తును ఉత్పత్తి చేయకుండానే... తమవల్లే నాణ్యమైన కరెంట్ వస్తుందనడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వాలు చేసిన కృషిని గుర్తించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు.