రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టి... సంక్షోభం సృష్టించేలా తెరాస సర్కారు పనిచేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణను సంక్షోభ రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి తలపై రూ.లక్షన్నర అప్పు ఉందని వివరించారు.
రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి తలపై రూ.లక్షన్నర అప్పు ఉంది: భట్టి విక్రమార్క
తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. వచ్చే మూడేళ్ల నాటికి రూ.6 లక్షల కోట్లు అప్పులు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చే అధికారం ఎవరిచ్చారని భట్టి ప్రశ్నించారు.
batti vikramarka
ప్రజలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి పనులకూ వేల కోట్లు అప్పులు చేస్తారా అని నిలదీశారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే... అప్పులు ఎలా పెంచాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని భట్టి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు