'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి' ధరణి వెబ్సైట్ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదని... కొత్త రెవెన్యూ చట్టంలోనూ లోపాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మ్యుటేషన్‌లో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని భట్టి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుల్లో నమోదైన వివరాల్లో తేడాలు ఉన్నాయని ఆరోపించారు. భూప్రక్షాళన సమయంలో రికార్డుల్లో సైతం తప్పుడు వివరాలు నమోదయ్యాయని తెలిపారు.
మ్యానువల్‌గా కూడా నమోదు చేయాలి...
ధరణీ వెబ్సైట్ ద్వారా భూరికార్టుల వివరాలు మొత్తం డిజిటలైజేషన్ చేయటం వల్ల కొంతమేర లాభం చేకూరినా... నష్టం కూడా పొంచి ఉందని వివరించారు. భూరికార్డుల వివరాలను మ్యానువల్‌గానూ నమోదు చేస్తేనే భద్రంగా ఉంటాయన్నారు. డిజిటలైజేషన్ వల్ల వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయటం లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధరణీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు...
భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ట్రైబ్యూనల్ ఏర్పాటు చేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందిపడుతారన్నారు. రెవెన్యూ కోర్టుల వల్ల అధికారులకు రైతులు తమ సమస్యలు వివరించుకోలుగుతారన్నారు. ట్రైబ్యూనల్స్లో న్యాయవాదులను నియమించుకుని సమస్య పరిష్కరించుకునే స్థోమత రైతుల దగ్గర ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్సైట్లో చాలా వరకు లోపాలున్నాయని... వాటన్నింటిని పరిష్కరించాల్సి ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్‌సైట్‌లోని సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు పాత రెవెన్యూ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.