రెండు పడకగదుల ఇళ్ల జాబితాలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి తలసాని ఇచ్చిన పక్కా ఇళ్ల జాబితా అంతా అవకతవకలుగా ఉందన్నారు. 2017 ఆర్థిక సంవత్సరానికే 2 లక్షల పడకగదుల ఇళ్లు కడతామంటూ... హైదరాబాద్ వాసులను తెరాస సర్కార్ మోసం చేసిందని విమర్శించారు.
'ఒక్క ఇల్లు కూడా కట్టలేదు... జాబితాలో మాత్రం చేర్చారు'
డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితా మొత్తం తప్పుల తడఖాగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నాంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టటం లేదని పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన జాబితాలో అనేక అవకతవకలున్నాయన్నారు.
clp leader batti vikramarka on double bed room houses in hyderabad
నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని తెరాస నేతలు చెబుతున్నా... అక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లోనూ ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో 2.4 లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారో స్పష్టంగా చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.