కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు భట్టి పేర్కొన్నారు.
రైతుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు : భట్టి - భట్టివిక్రమార్క వార్తలు
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టాలపై తరహాలోనే సాగు చట్టాలపైనా వ్యతిరేక తీర్మానం చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
batti vikramarka
కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సీఎం వ్యక్తిగత అవసరాల కోసం రైతుల భవిషత్య్‌ను మోదీ వద్ద తాకట్టుపెట్టడం సరికాదని భట్టి అన్నారు. కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు.
ఇదీ చదవండి :వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు