తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

కరోనా కట్టడిలో భాగంగా నేటి నుంచి 2 వారాల పాటు ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది.

ap curfew news, 12pm to 5am will be imposed in Andhra Pradesh
నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

By

Published : May 5, 2021, 4:44 AM IST

ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అత్యవసరం మినహా అన్ని దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు తదితరాలను కర్ప్యూ పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆటోలు, ట్యాక్సిలు, సిటీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తిరిగేందుకు అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర బస్సులు, జిల్లాల మధ్య బస్సు సర్వీసులు కూడా నడుపరు.

వైద్యం, అత్యవసర సేవలకు మినహాయింపు

కర్ఫ్యూ నుంచి పలు విభాగాలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కర్ప్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. టెలికమ్యునికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్ సర్వీసులు, ఐటీ సర్వీసులకు మినహాయింపు ఉంది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోలియం, గ్యాస్ అవుట్ లెట్లు, విద్యుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులకూ కర్ఫ్యూ వర్తించదు.

ఆస్పత్రులు, ల్యాబ్ లు, మెడికల్ దుకాణాలు, సహా అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. సరకు రవాణా వాహనాలను అనుమతిస్తారు. అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారు, కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొనేందుకు వెల్లేవారికి మినహాయింపు ఉంది.

గుర్తింపు కార్డు తప్పనిసరి

కర్ప్యూ వేళల్లో విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు, బస్టాండ్లకు రాకపోకలు చేసే వారు రిజర్వేషన్ చేసిన టికెట్ చూపించి ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రులు, ల్యాబ్ లు, మెడికల్ దుకాణాలు సహా అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు కర్ఫ్యూ మినహాయింపు ఉంది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయస్థానాల్లో పనిచేసే ఉద్యోగులు, స్థానిక సంస్థల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది విధులు నిర్వహించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు, వైద్యసిబ్బంది విధులు నిర్వహించవచ్చని తెలిపింది. రాకపోకలు జరిపే సమయాల్లో గుర్తింపు కార్డులను తప్పక ధరించాలని ఆదేశాల్లో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సూచించింది.

వివాహాలకు 20 మందే

పెళ్లిళ్లు, వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు జరపుకొనేందుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. 20 మందికి మించకుండా, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుక జరుపుకోవాలని ఆదేశాలిచ్చింది. రోజంతా 144 సెక్షన్​ను అమలు చేయాలని ఆదేశాల్లో తెలిపిన ఏపీ ప్రభుత్వం.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆంక్షలను తప్పక అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు సహా అన్ని విభాగాల అధిపతులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

ABOUT THE AUTHOR

...view details