డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతులు కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో క్రమంగా హాజరు శాతం పెరుగుతోందన్నారు. పాఠశాలలు ప్రారంభం నుంచి 40-50 శాతం మధ్య నడుస్తున్న హాజరు... క్రమేణా 60 శాతం చేరుకుంటోందని ఆయన తెలిపారు. రోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు.
14 నుంచి ఆరు, ఏడు విద్యార్థులకు తరగతులు - ap schools reopen news
ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గటంతో పాఠశాలల్లో హాజరుశాతం పెరుగుతోంది. ఈ క్రమంలో 6, 7 తరగతులను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
14 నుంచి ఆరు, ఏడు విద్యార్థులకు తరగతులు
పాఠశాలల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి :విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించినందుకు వైద్యాధికారి సస్పెండ్