తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ - తమ్మినేని సొంత నియోజకవర్గంలో వర్గ భేదాలు న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో వైకాపా నేతల మధ్య అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే వైకాపా నేతలు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడ్డారు.

ycp gharshana
వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ

By

Published : Jun 25, 2020, 5:41 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే వైకాపా నేతల్లో వర్గ విభేదాలు తలెత్తాయి. సభాపతి సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోనే వివాదాలు బహిర్గతమయ్యాయి. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో... వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని ఎదుటే.. వైకాపా నేతలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.

పరిస్థితి అదుపు తప్పి.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇళ్ల స్థలాల జాబితా తయారీ విషయంలో.. కార్యకర్తలు ఇలా సభాపతి సాక్షిగా బాహాబాహీకి దిగారు. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ

ఇదీ చూడండి:హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details