మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు - hyderabad latest news
11:11 June 16
మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు కలకలం సృష్టించాయి. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఎవరు చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి పోలీసులు అదనపు బలగాలను తరలిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Delta Variant: డెల్టా వైరస్ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!