రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులోని రాయికల్ టోల్‌గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ లేకపోవటంతో.... టోల్‌గేట్ నిర్వాహకులు, తెరాస నేతల మధ్య వివాదం మొదలై... ఘర్షణకు దారితీసింది. తెరాస నేత, నసూరుల్లాబాద్ సర్పంచ్ ప్రణీల్, టోల్ నిర్వాహకులు పరస్పరం దాడి చేసుకున్నారు.
తెరాస నేతలు, టోల్‌గేట్ నిర్వాహకుల మధ్య గొడవ.. ఒకరికి తీవ్ర గాయాలు.. - టోల్‌గేట్ వద్ద తెరాస నేతలు నిర్వాహకుల మధ్య గొడవ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులోని టోల్‌గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోవటంతో.. తెరాస నేతలు, టోల్‌గేట్ నిర్వాహకుల మధ్య గొడవ తలెత్తింది. ఇరువర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కాసేపు వాహనాలు ఆగిపోయాయి.
Clash between TRS leaders and tollgate managers
ఈ ఘటనలో ప్రణీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఘర్షణతో టోల్‌గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్‌గేట్ వద్ద వస్తువులను ఓ వర్గం వారు ధ్వంసం చేశారు. దీంతో కాసేపు వాహనాలు సైతం ఆగిపోయాయి.
ఇవీ చదవండి: