జీహెచ్ఎంసీ పోలింగ్ వేళ నాచారం 6 వ డివిజన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు తమ పార్టీ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ... తెరాస నేతలు ఆందోళనకు దిగారు.
నాచారంలో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ - nacharam elections
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో ఆయా పార్టీశ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. నాచారం 6వ డివిజన్లో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
clash between trs and congress leaders at nacharam
ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి... గొడవకు దారి తీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్ వల్ల తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ శేఖర్ ఆరోపించారు.